NICL రిక్రూట్మెంట్ 2024 డిగ్రీ అర్హతతో 500 అసిస్టెంట్‌ ఉద్యోగాలు

Photo of author

కోల్‌కతాలో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) తన ప్రధాన కార్యాలయం నుండి భారీ నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐసీఎల్ కార్యాలయాలలో, ఓపెన్ మార్కెట్ ఆధారంగా క్లాస్-III కేడర్‌లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్ 2024 వివరాలు

  • సంస్థ పేరు: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL)
  • మొత్తం ఖాళీలు: 500
  • ఉద్యోగం పేరు: అసిస్టెంట్ (క్లాస్-III)
  • పే స్కేల్: నెలకు రూ.22,405- రూ.62,265 
  • అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
  • పని ప్రదేశం: భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 24 అక్టోబర్ 2024
  • రిజిస్ట్రేషన్ చివరి తేది: 11 నవంబర్ 2024
  • అప్లికేషన్ ఫీజు చెల్లింపు తేది: 24 అక్టోబర్ 2024 నుండి 11 నవంబర్ 2024 వరకు
  • ఫేజ్ I పరీక్ష తేదీ (ప్రిలిమినరీ): 30 నవంబర్ 2024
  • ఫేజ్ II పరీక్ష తేదీ (మెయిన్స్): 28 డిసెంబర్ 2024
  • హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ: వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటించబడుతుంది

ఖాళీల వివరాలు

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంమొత్తం
ఆంధ్రప్రదేశ్21
అరుణాచల్ ప్రదేశ్1
అస్సాం22
బీహార్10
ఛత్తీస్‌గఢ్15
గోవా3
గుజరాత్30
హర్యానా5
హిమాచల్ ప్రదేశ్3
జార్ఖండ్14
కర్ణాటక40
కేరళ35
మధ్య ప్రదేశ్16
మహారాష్ట్ర52
మణిపూర్1
మేఘాలయ2
మిజోరాం1
నాగాలాండ్1
ఒడిషా10
పంజాబ్10
రాజస్థాన్35
సిక్కిం1
తమిళనాడు35
తెలంగాణ12
త్రిపురా2
ఉత్తర ప్రదేశ్16
ఉత్తరాఖండ్12
పశ్చిమ బెంగాల్58
ఆండమాన్ & నికోబార్1
చండీగఢ్ (UT)3
ఢిల్లీ (UT)28
జమ్మూ మరియు కాశ్మీర్2
లడాఖ్1
పుదుచ్చేరి2
మొత్తం500

వయసు పరిమితి (అక్టోబర్ 1, 2024 నాటికి)

  • కనీసం 21 నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు
  • SC/ST: 5 ఏళ్ల వయస్సు రాయితీ
  • OBC: 3 ఏళ్ల వయస్సు రాయితీ

విద్యార్హతలు

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు.. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం.

దరఖాస్తు ఫీజులు

  • SC/ST/PwBD/EXS: ₹100
  • ఇతరులు: ₹850

ఫీజు చెల్లింపు ఆన్లైన్ ద్వారా మాత్రమే.

NICL Assistant Recruitment

ఎంపిక విధానం

  • ప్రిలిమినరీ పరీక్ష (ఫేజ్ I): 100 మార్కుల ఎంపిక పరీక్ష (ఆబ్జెక్టివ్).
  • మెయిన్స్ పరీక్ష (ఫేజ్ II): 200 మార్కులతో పలు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రాంతీయ భాషా పరీక్ష: భాషా పరిజ్ఞానం పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి.

చివరి ఎంపిక: మెయిన్స్ పరీక్ష ఫలితాల ఆధారంగా, ప్రాంతీయ భాషా పరీక్షలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం

  1. రిజిస్టర్ చేసుకోండి: ప్రాథమిక వివరాలు నమోదు చేయండి.
  2. ఫారమ్ పూర్తి చేయండి: వ్యక్తిగత, విద్యా వివరాలు, ఇతర వివరాలు నమోదు చేయండి.
  3. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి: ఫోటో, సంతకం, బొటన వేలు ముద్ర అప్‌లోడ్ చేయాలి.
  4. ఫీజు చెల్లింపు: డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
  5. సబ్మిట్ మరియు ప్రింట్: దరఖాస్తు సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

ముఖ్యమైన లింకులు